ప్రతిపక్షం, జూన్ 17: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర-నేర నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఏడుగురిని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. వీరు సరిహద్దుల గుండా ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు రాజధానిలోని కీలక ప్రాంతాలపై రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. సేకరించిన సమాచారాన్ని విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లకు పంపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

















