ప్రతిపక్షం, జూన్ 10: మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. తెల్లవారుజామున మాట్లాడుకుందామని పిలిచి, మరో వ్యక్తి సహాయంతో మహిళపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మృతురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గతంలో కూడా తుపాకీతో హల్‌చల్ చేసినట్లు గుర్తించారు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన వ్యక్తుల ద్వారా ఆయుధాన్ని సమకూర్చుకున్నాడనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

















