ప్రతిపక్షం, జూలై 24: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విద్యార్థుల ఆందోళనలపై మరోసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నిరసనలకు మద్దతు తెలిపిన ఆయన, తాజా ప్రకటనలో విద్యార్థులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు.
దేశంలో విద్య, విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ, పరీక్షల లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
విద్యార్థులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీక్షలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి సోనమ్‌ను ఉద్దేశించి, దీక్ష ముగించి భోజనం చేయాలని, అవసరమైతే తన ఇంటి నుంచి భోజనం పంపిస్తానంటూ సల్మాన్ ఖాన్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.
















