యంత్రాలుగా మారుతున్న పిల్లలు: వైద్యుల ఆందోళన

ప్రతిపక్షం, జూలై 22: ప్రస్తుత విద్యా విధానంలో మార్కులు, ఉద్యోగాలకే ప్రాధాన్యం పెరగడంతో పిల్లలు యంత్రాల్లా మారుతున్నారని మానసిక ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి సైన్స్, గణితంతో పాటు భాష, సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు వంటి మానవీయ అంశాల అధ్యయనం కూడా సమానంగా అవసరమని వారు సూచిస్తున్నారు.

మానసిక నిపుణుడు డా. శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుతం 15 నుంచి 22 ఏళ్ల వయస్సు నుంచే విద్యార్థులను కార్పొరేట్ ఉద్యోగాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనివల్ల సృజనాత్మకత, స్వతంత్ర ఆలోచనా శక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు.

విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తులుగా ఎదగాలంటే మానవీయ శాస్త్రాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పాఠ్యాంశాలను రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News