ప్రతిపక్షం, జూలై 21: హైదరాబాద్ శివారు నార్సింగిలోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని శ్రేయ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసినట్లు భావిస్తున్న లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.
‘సారీ అమ్మా, నాన్న.. మొదటిసారి తెలియక పరీక్ష హాల్‌లోకి ఫోన్ తీసుకెళ్లడం నా తప్పు. అప్పటి నుంచి సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఒకసారి బుక్ అయినా కొన్ని బతుకులకు సిగ్గు, శరం ఉండదంటూ తిడుతున్నారు. అందుకే చనిపోతున్నా’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.



















