మహాపంచాయత్‌.. ఢిల్లీకి భారీగా చేరుకుంటున్న రైతులు

ప్రతిపక్షం, జూలై 21: సీజేపీ ఆందోళనలతో ఉద్రిక్తంగా ఉన్న ఢిల్లీలో ఇవాళ మరో భారీ నిరసన జరగనుంది. అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశ్‌ బచావో మోర్చా మహాపంచాయత్‌కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు భారీగా ఢిల్లీకి బయలుదేరారు. కిసాన్‌ ఘాట్‌ వద్ద నిరసన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమలైతే చిన్న రైతులు, వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందని ఆరోపిస్తూ రైతు సంఘాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News