వికారాబాద్ ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 22: వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా పనుల పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని, అవసరమైతే ఒక రోజు నిర్మాణ ప్రాంతంలోనే బస చేస్తానని తెలిపారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మిస్తున్న ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలు, హాస్టళ్ల నిర్మాణాలను పరిశీలించిన సీఎం, పనులు నెమ్మదిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై నెలవారీ నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, వచ్చే వారంలోగా లబ్ధిదారులకు ప్లాట్ల పట్టాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Spread the love

Related News

Latest News