సీఎం రేవంత్‌ హెచ్చరికతో ఎమ్మెల్యేలు అలర్ట్‌.. ఆగస్టు 3 వరకు నియోజకవర్గాల్లోనే

ప్రతిపక్షం, జూలై 20: తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ వరకు నియోజకవర్గాలకే పరిమితం కావాలని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్లారు.

ఇటీవల 21 నియోజకవర్గాల్లో ‘సర్‌’ కార్యక్రమాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. మరో నాలుగు నియోజకవర్గాల్లో కార్యక్రమాలను ప్రారంభించలేదని నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో పనితీరును మెరుగుపర్చుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ‘సర్‌’ కార్యక్రమాలపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. అప్పటిలోగా పనితీరు మార్చుకోవాలని నేతలను హెచ్చరించడంతో ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు.

Spread the love

Related News

Latest News