ప్రతిపక్షం, జూలై 20: నిజామాబాద్ నూతన కలెక్టర్ కార్యాలయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై ప్రభావం, తాగునీరు, పశుగ్రాసం, సాగునీటి నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన ముందస్తు చర్యలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.


















