ఎల్బీనగర్ ఫ్లెక్సీ వివాదంపై జగ్గారెడ్డి కమిటీ నివేదిక

ప్రతిపక్షం, జూలై 19: ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీ వివాదంపై ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించింది. గాంధీభవన్‌లో ఆయనను కలిసిన కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, మధు యాష్కీ, చల్లా నర్సింహారెడ్డి నివేదికను అందజేశారు.

యూత్ కాంగ్రెస్ చీఫ్ జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్ మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివాదానికి దారితీసిన పరిస్థితులు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిశీలించిన కమిటీ.. పార్టీ అంతర్గత సమస్యకు పరిష్కారం సూచిస్తూ నివేదిక రూపొందించినట్లు సమాచారం.

నివేదికను పరిశీలించిన అనంతరం పార్టీ అధిష్ఠానం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంచి, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News