ప్రతిపక్షం, జూలై 18: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వరుణ యాగాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
త్వరలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వరుణ యాగాలు నిర్వహించాలని పండితులు, అర్చకులకు ఆమె సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఆందోళనకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని మొత్తం 12,760 గ్రామాల్లో 11,479 గ్రామాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వర్షాలు కురిసి రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యలు తొలగిపోవాలని ఆకాంక్షించారు.

















