భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం.. నేడు నింగిలోకి తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్

ప్రతిపక్షం, జూలై 18: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన ‘విక్రమ్-1’ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ‘ఆగమన్’ పేరుతో చేపట్టనున్న ఈ మిషన్‌ను ఉదయం 11.30 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

భారత్‌లో ఒక ప్రైవేట్ సంస్థ స్వయంగా అభివృద్ధి చేసి, ప్రయోగించనున్న తొలి ఆర్బిటల్ రాకెట్‌గా విక్రమ్-1 గుర్తింపు పొందనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

సుమారు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం ఈ రాకెట్‌కు ఉంది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆగమన్’ మిషన్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News