ప్రతిపక్షం, జూలై 11: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్ననాటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పుడు తోటి క్రికెటర్లతో కలిసి దిగిన ఆ ఫొటోలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఆశ్చర్యంగా చూస్తున్న గిల్, నేడు అదే సచిన్ పక్కనే కూర్చొని వింబుల్డన్ సెమీఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడం అభిమానులను ఆకట్టుకుంది. చిన్ననాటి కలను నిజం చేసుకుంటూ భారత జట్టుకు కెప్టెన్‌గా ఎదిగిన గిల్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “విజయం అంటే ఇదే” అంటూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


















