Trending Now

ఏపీ మంత్రి రోజా, కేటీఆర్‌పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు..

ప్రతిపక్షం, తెలంగాణ: ఏపీ మంత్రి రోజా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేశారు. తండ్రిపేరు అడ్డు పెట్టుకొని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడని.. కేసీఆర్ అబ్బాయిగా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపు లేదని బండ్ల గణేశ్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పోరాట యోధుడు, బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యాడని బండ్ల కొనియాడారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని, రేవంత్ సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నాడని అన్నారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లినట్లయితే మూడు సీట్లు కూడా రాకపోయేవని అన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ హయాంలో పనిచేసిన అధికారుల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందని బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే ఏపీ మంత్రి రోజాపై కూడా బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి రోజా డైమండ్ రాణి అన్నారు. రేవంత్ ఫైటర్ అని.. జగన్ ఆక్సిడెంట్ సీఎం, నాన్న చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి పులుసు రాణి అంటూ రోజాను ఉద్దేశిస్తూ.. గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Spread the love

Related News