[t4b-ticker]

ఢిల్లీ నిరసనల్లో పోలీసుల దాడి.. ‘అమ్మాయిల ప్రైవేట్‌ భాగాలకూ గాయాలు’ అంటూ రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 10: ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసుల చర్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్‌ గన్స్‌, ముళ్ల లాఠీలు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని ఆరోపించారు. ఈ ఘటనలో మహిళా విద్యార్థులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు.

నిరసనల్లో పాల్గొన్న అమ్మాయిలను కూడా పోలీసులు వదల్లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. పలువురు మహిళా విద్యార్థుల శరీరంలోని సున్నితమైన భాగాలకు గాయాలయ్యాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌కు హాజరుకావడం లేదంటూ రాహుల్‌ విమర్శలు చేశారు. ఘటనపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా దోషి లేదా అసమర్థుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారంపై కేంద్రం నుంచి సమాధానం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News