Trending Now

హెలీకాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు, విదేశాంగమంత్రి మృతి


ప్రతిపక్షం, వెబ్​ డెస్క్​:

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి అమీర్​ అబ్దుల్లా హియన్ దుర్మరణం పాలయ్యారు. ఇరాన్ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. పర్వతాలు, మంచులో ప్రతికూల వాతావరణం వల్లహెలికాప్టర్ ప్రమాదం జరిగిందని నుంచి ప్రాణాలతో బయటపడతారని అనుకున్నా అది జరగలేదని ఇరాన్ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. దురదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న అందరూ మరణించినట్లు భావిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. ఆదివారం ఈ ఘటన జరగగా.. తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ ​లోని శిథిలాలను చేరుకోవడానికి సహాయక బృందాలు రాత్రంతా మంచు తుఫాను, క్లిష్టమైన భూభాగాల దాటి సంఘటనా స్థలాన్ని చేరుకున్నాయి. హెలికాప్టర్ పర్వత శిఖరంలో కూలిపోయినట్లు అక్కడి అధికారులు పంపిన ఫొటోల ద్వారా తెలుస్తోందని, అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా పూర్తి సమాచారం లేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. టర్కీ డ్రోన్ సోమవారం తెల్లవారుజామున హెలికాప్టర్ శిథిలాలుగా ఉన్న చోటును గుర్తించింది. అమెరికాలో తయారైన బెల్ 212 హెలికాప్టర్‌లో రైసీ ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ సైన్యం, ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ ‌తనిఖీ, సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ప్రాంతీయ అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్​ అధ్యక్షుడు మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News