Trending Now

టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా మంగళవారం జరుగుతోన్న కూటమి శాసనసభాపక్ష సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో బలపరిచారు. అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు: చంద్రబాబు

తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన ‘నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడగుపెడతానని చెప్పా. ప్రజలు నా మాట నిలబెట్టారు. వారందరి సహకారంతో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా’ అని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News