[t4b-ticker]

ఎల్లో అలర్ట్‌.. తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు

ప్రతిపక్షం, ఆగస్టు 26, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అదేవిధంగా కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Spread the love

Related News

Latest News