[t4b-ticker]

వందేమాతరం రెండు చరణాలే పాడతాం: డీకే శివకుమార్

ప్రతిపక్షం, ఆగస్టు 26: వందేమాతరం గేయంలోని రెండు చరణాలను మాత్రమే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్నే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో అనుసరిస్తామని ఆయన తెలిపారు.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన డీకే శివకుమార్.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌ వైఖరికి అనుగుణంగానే కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఇదే సందర్భంగా మహిళా సాధికారతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పటికీ, కర్ణాటక మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా ఎందుకు లేరనే ప్రశ్న ఎదురైంది.

దీనిపై స్పందించిన డీకే శివకుమార్‌.. మహిళలకు ప్రాధాన్యం కల్పించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

Spread the love

Related News

Latest News