హుస్నాబాద్ ప్రతిపక్షం: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలొ ‘మన ఊరు – మన బడి’ కింద పాఠశాలలో 54 లక్షలు మంజూరు ఐయి జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంఈఓ దేశి రెడ్డి, స్థానిక కౌన్సిలర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి చొరవ చూపడంతో.. దేశంలోని ప్రతి పాఠశాలలో అదనపు నిధులు కేటాయించరన్నారు. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ మంజూరు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వెంకటయ్య, పాఠశాల యజమాని కమిటీ చైర్మన్ కాశ బోయిన శ్రీధర్, కాంట్రాక్టర్లు జాగిరి సత్యనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు తదిరులు పాల్గొన్నారు.