ప్రతిపక్షం, జూన్ 26: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్ధరాత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని జైలుకు తరలించారు.
విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రాసేందుకు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు పూర్తికావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు భగీరథ్‌ను మళ్లీ జైలుకు తరలించారు.
ఈ కేసులో సాధారణ బెయిల్ కోసం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసు విచారణ కొనసాగుతోంది.
















