Trending Now

‘కరీంనగర్ ను.. కరప్షన్, కలెక్షన్ కు కేరాఫ్ గా మార్చారు’

జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి సంచలన కామెంట్స్..

ప్రతిపక్షం కరీంనగర్: కళకళలాడే కరీంనగర్ బి ఆర్ ఎస్ పార్టీ పుణ్యమాని, అవినీతి, అక్రమాలకు నిలయంగా, కరప్షన్ కలెక్షన్ కు కేరాఫ్ గా మారిందని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి జరిగిన భూమాఫియా ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, గుట్కా మాఫియా నడిపింది బీఆర్ ఎస్ నేతలనే అని.. వీరందరూ నేరుగా ఇంటి నుండి జైలు బాట పట్టారని జైలుకు వెళ్లి వస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మొదలుకొని జంగిలి సాగర్ వరకు అందర్నీ తక్షణమే టిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పాపాలలో మంత్రి గంగుల ప్రమేయమే లేకుంటే గంగుల అనుచరులందరూ జైలుకు ఎందుకు వెళుతున్నారని.. నిందితులుగా ఎందుకు మారుతున్నారని ప్రశ్నించారు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ పాపాలకు అడ్డుకట్ట వేసి ఉంటే నేడు ఈ పరిణామాలు పునరావృతం అయ్యవా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ చొప్పదండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రాజేశం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాముడి రాజిరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ ఎండి ఆమీర్ తదితరులు ఉన్నారు.

Spread the love