స్థానిక కళా నైపుణ్యతకు సముచిత ప్రాధాన్యత..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్17 : స్థానిక కళ నైపుణ్యతకు సముచిత ప్రధానతమిస్తూ నిర్మల్ పరిసరాలలోనే నిర్మించిన ‘మా ఊరి రాజారెడ్డి’ సినీ నటులను బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల సంఘ భవనంలో తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు చిన్నయ్య మాట్లాడుతూ.. స్థానిక కళాకారులతో నిర్మల్ పరిసర అటవీ ప్రాంతాలు ఇతర అద్భుతమైన లొకేషన్స్ లలో తీయబడ్డ ‘మా ఊరి రాజారెడ్డి’ సినిమా మొదటి ప్రయత్నంలోనే అద్భుతంగా విజయవంతం అవడం మహోన్నతమైనదని చెప్పారు. నిర్మాతలు ఎర్ర రవీందర్, అయిత వెంకటరమణ చేసిన ప్రయత్నం సఫలమవడం అభినందనీయమని చెప్పారు.
ఈ మధ్య కాలంలోనే స్థానిక కళాకారులకు తగిన విధంగా గుర్తింపు రావడం ఏ కాకుండా తగిన విధంగా వారు భవిష్యత్తును బంగారు బాటలో నడిపించునందుకు ప్రోత్సహిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు అంజన్న, ఎస్ .రాజన్న, రాంరమేష్, చిన్నన్న జున్ను అనిల్ కుమార్, టిఎన్జీల సంఘ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, వెంకటరమణా, నరేందర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.