Trending Now

సమిష్టి కృషితోనే గెలుపు..

ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయం

రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 7 : సమిష్టి కృషితోనే ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయం అవుతుందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని బ్రాహ్మణ సమాజ్ భవనంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అంతకంటే ముందు చెప్పిన నల్లధనాన్ని తేలేకపోగా దేశాన్నిఅప్పుల పాలు చేసిందని ఆయన విమర్శించారు. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని దశలవారీగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నదని అదే మాదిరి కేంద్రంలోనూ వస్తూ.. ఇస్తున్న ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రణాళిక ఇచ్చిన హామీలన్నింటిని దశలవారీగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నదని అదే మాదిరి కేంద్రంలోనూ వస్తూ.. ఇస్తున్న ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రణాళిక రూపొందించుకున్నదని చెప్పారు.

దేశం అత్యంత ప్రమాద పరిస్థితులలో ఉందని అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దిశగా ముందుకు వెళుతున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించడం చేయదని ఎలా నమ్మాలని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు సమ న్యాయం, సమసంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు.వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్పారు.

అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని అన్ని వర్గాల వారు సమైక్యంగా కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పలు సర్వేల ద్వారా తేలిపోయిందని భవిష్యత్తు దేశ ప్రధాని రాహుల్ గాంధీ అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సుస్థిర పాలనను అందించి దేశంలో శాంతి మత సామరస్యాల ను కాపాడిందన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణతో పాటు అన్ని వర్గాలకు తగిన న్యాయం చేసే సామర్థ్యం సత్తా దేశంలో కాంగ్రెస్ కే ఉందని అల్లోల స్పష్టం చేశారు. 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఆత్రం సుగుణను గెలిపించుకోవాలని ఆయన సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముడుసు సత్యనారాయణ, ధర్మాజీ గారి రాజేందర్, మాజీ సర్పంచ్ లు కృష్ణ ప్రసాద్ రెడ్డి , ప్రకాష్ రెడ్డి సాయి రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ వినోద్ కుమార్, మాజీ ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, అనుముల భాస్కర్, అమరవేణి నర్సాగౌడ్, పాకాల రామచందర్, డా. జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News