ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు(కేకే) త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రేవంత్ తో సమావేశమై పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, కేకే కూతురు హైదరాబాద్ బేయర్ గద్వాల విజయ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. గురువారం కేకే మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తేల్చి చెప్పారు.