Trending Now

కేసీఆర్ vs రేవంత్.. ట్విట్టర్ వార్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కేసీఆర్ ట్విట్టర్లో అడుగు పెట్టిన తర్వాత మాటల తూటాలు మరింత ఘాటుగా పేలుతున్నాయి. కేసీఆర్ ట్వీట్లకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. ఆ మధ్య మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందని కేసీఆర్ చేసిన ట్వీట్ కి వెంటనే స్పందించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ వ్యవహారంపై కూడా ఆయన వెంటనే స్పందించారు. కేసీఆర్ ట్వీట్ కి కౌంటర్ గా మరో ట్వీట్ పెట్టారు.

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎక్స్‌ లో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్‌లో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. మొన్న సూర్యాపేట, నిన్న మహబూబ్‌నగర్‌, ఇవాళ ఓయూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే నెలపాటు హాస్టళ్ల మూసివేతకు నోటీసు ఇచ్చారు. అందులో విద్యుత్‌, నీటి కొరత గురించి ప్రస్తావించారు. మేం వచ్చాకే మూసేస్తున్నట్లు చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ఠ’’ అని రేవంత్‌ విమర్శించారు.

Spread the love

Related News