ప్రతిపక్షం, జూన్ 04: హైదరాబాద్‌లో తెలంగాణ రాజకీయ నేత కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ ఉప హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బ్రిటిష్ హై కమిషన్ రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రాఘురామన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్–బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సహకారం, పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, యువత ఉపాధి వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో పారిశ్రామిక వృద్ధి, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి కవిత ప్రతినిధి బృందానికి వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ సహకార అవకాశాలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు.

















