ప్రతిపక్షం, జూలై 05: అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లోనే రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట ప్రాంతాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నం బియ్యం పంపిణీ కొనసాగిస్తోందని, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే త్వరలోనే రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.

















