ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎక్స్ ఖాతా హ్యాక్.. అప్రమత్తంగా ఉండాలని సూచన

ప్రతిపక్షం, జూలై 02: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అధికారిక ఎక్స్ (X) ఖాతా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్‌కు గురైన ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కలిసి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఖాతా నుంచి వచ్చే అనుమానాస్పద పోస్టులు, లింకులు లేదా వ్యక్తిగత సందేశాలను నమ్మవద్దని అధికారులు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love

Related News

Latest News