రైతు భరోసా ఎగ్గొట్టి, ఆశీర్వాద సభలా? రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ప్రతిపక్షం, జూన్ 30: రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతులకు రావాల్సిన వేల కోట్ల రూపాయలను విడుదల చేయకుండా, ఇప్పుడు ఆశీర్వాద సభ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించారు.

గత 30 నెలల్లో రైతులకు అందాల్సిన సుమారు రూ.30 వేల కోట్లను నిలిపివేశారని ఆరోపించిన కేటీఆర్, ఈ కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 11 విడతల్లో రూ.73 వేల కోట్ల రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తుచేశారు.

పదేళ్ల పాటు తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి దిశగా సాగిందని, ప్రస్తుతం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

Spread the love

Related News

Latest News