Trending Now

మేడారం జాతర.. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు..

ప్రతిపక్షం, తెలంగాణ: రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం.. అనంతరం ఈ జాతర జరగుతుండటంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే జాతరను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారం జాతర కోసం నాలుగు వేలకు పైగా బస్సులను సిద్ధం చేసింది. ఈ జాతర కోసం ఏకంగా ఓ రైలునే ఏర్పాటు చేయడం విశేషం. ఈ రైలు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు నడుస్తుంది. దీంతో నేటి నుంచి జాతర ప్రారంభమైంది. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి.

Spread the love