ప్రతిపక్షం, జూన్ 15: హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. గతంలో ప్రతి బుధవారం ఒక్కో మంత్రి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకునేవారు.
కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు.
ప్రతి బుధవారం నిర్వహించే ఈ ముఖాముఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల మంత్రులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.

















