Trending Now

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది : ప్రధాని మోదీ

గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెరుగుదల

రూ.6 వేల 697 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం

ఎన్టీపీసీ ఉద్యుత్​ జాతికి అంకితం

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ఆదిలాబాద్​ నుంచి ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా సహకరిస్తున్నదని, ఇక ముందు కూడా సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడిందని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇదే సంకల్పంతో ముందుకు సాగుతామని.. అన్ని వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందంటూ వివరించారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా.. 6 వేల 697 కోట్ల అభివృద్ధి పనులకుప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. NTPC ప్రాజెక్ట్‌ సెకండ్‌ ఫేజ్‌ విద్యుత్‌ప్లాంట్‌ జాతికి అంకితం చేశారు.

అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని. అండర్‌ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌-బేల-మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు కూడా సభలో భూమిపూజ చేశారు ప్రధాని మోదీ. ప్రధాని సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని.. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని మోదీ తెలిపారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని.. మోదీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుందన్నారు.తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామని.. అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.

పెద్దన్న మోదీజీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర పెద్దన్న పాత్ర పోషిస్తూ.. సహకారం అందించాలని కోరారు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే..ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ కోరారు. . ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ప్రధానిని అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని వెంట ముగ్గురు కేంద్రమంత్రుల రానున్నారు.

Spread the love

Related News

Latest News