ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీ టెట్ ఫైనల్ కీ అందుబాటులోకి వచ్చింది. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా మీరు ఫైనల్ కీ, స్కోరు కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీను విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. మార్చి 13నే ఎస్‌జీటీ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీను రిలీజ్ చేయాల్సి ఉండగా.. మార్చి 14 రాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెళితే అక్కడ సబ్జె్క్టులవారీగా ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది.
ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న విడుదల చేసింది జగన్ సర్కార్. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించింది. అదే నెల 23 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 09వ తేదీ వరకు జరిపారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.