మాజీ మంత్రి, ఎమ్మెల్యే
హరీష్ రావు
సిద్దిపేట, మార్చి 7: సిద్దిపేట నియోజకవర్గ వర్గ ప్రజలకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహముతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. మహా శివరాత్రి రోజున స్వామి వారి ఉపవాస దీక్ష లో ప్రజలందరూ భక్తితో స్వామిని కొలిచి మీ కోర్కెలు నెరవేరాలి అని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాని కోరుకున్నారు..