ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 11: హైదరాబాద్ కు చెందిన తెలంగాణ సారస్వత పరిషత్తు బాలల కథా సంకలనం కోసం రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులు వ్రాసిన 31 కథలు ఎంపిక చేయగా.. జక్కాపూర్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని బోయిని నందిని వ్రాసిన “బానిసలు”కథ ఎంపికైనదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ షౌకత్ అలీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని నందిని ని, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.