సీఎం రేవంత్‌తో భేటీ అయిన పసునూరి దయాకర్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్ఎస్ కు పార్టీ నేతలు షాక్ ఇస్తూనే ఉన్నారు. గత పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల సమయంలో తలబొప్పిగా మారింది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈనెల 17న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సీఎం రేవంత్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ పార్టీ టికెట్ ఆయనకు ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.