Trending Now

శర్వానంద్ బర్త్ డే.. 35వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ 35వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది. శర్వానంద్ నటిస్తున్న 35వ సినిమాకు ‘మనమే’ అని టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో పెయింటింగ్ రోలర్‌ పట్టుకొని శర్వానంద్ ఉండగా.. పక్కనే ఓ చిన్నబ్బాయి కనిపిస్తున్నారు. ఇక టీజర్ చివరలో కృతి శెట్టి కనిపించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా.. కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హీషం అబ్దుల్ వాహద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై శర్వానంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

Spread the love