పార్లమెంట్‌లో భగవాన్ బిర్సా ముండాకు ఘన నివాళులు

ప్రతిపక్షం, నవంబర్ 15: భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర ప్రముఖులు కూడా కార్యక్రమానికి హాజరై భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఒకేచోట పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Related News

Latest News