Trending Now

బీజేపీకి షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ ఇచ్చారు కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి ప్రెసిడెంట్ పశుపతి కుమార్ పరాస్. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. NDA కోసం నిజాయతీగా పనిచేసినా తమ పార్టీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ NDA నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. కాగా, బీహార్ తరఫున NDA నిన్న ప్రకటించిన లోక్‌సభ సీట్లలో RLJPకి ఒక్క సీటూ కేటాయించలేదు.

Spread the love