[t4b-ticker]

మాదకద్రవ్యాలు సేవించే వారిని పటిస్తే రూ.లక్ష బహుమతి

*యువతకు మరణశాసనంగా మాదకద్రవ్యాలు .

*నాడీవ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం.

*ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ .

*మత్తు.. ఒక మహావిపత్తు ఎస్ఐ శివకుమార్ .

ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 05: మాధక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మంగ‌ళవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ సహకారంతో చండూరు వాలంట‌రీ టీం సభ్యుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి చండూరు మున్సిపల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం, ఎస్ఐ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న వయసులో విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి చదువు మధ్యలోనే నిలిపివేసి వ్యసనాలకు బానిసవుతున్నారన్నారు.సమాజంలో అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడుతూ వారి జీవితాలలో ఆగం చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. యువతను పెడతోవ‌ పట్టించే మాదక ద్రవాలను విక్రయించినా, వాటిని సేవించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మాదక ద్రవ్యాలు యువత జీవితాన్ని నిలువెల్లా నాశనం చేస్తోంది. సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారు. మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ తరచుగా తీసుకోవడం వల్ల ప్రధానంగా నాడీ వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు మెదడు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు .

ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలను విక్రయించిన వారిని, సేవించిన వారిని పట్టిస్తే వారికి లక్ష రూపాయల నగదు బహుమతులు అందజేస్తామని ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News