ప్రతిపక్షం, నల్గొండ : అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు ఇచ్చిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. గురువారం నకిరేకల్‌లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా కాటేపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పగిలిన డ్యాములు కట్టి, ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ రద్దయిన నోటు లాంటిదని.. కాంగ్రెస్ చిల్లుపడ్డ నోటు లాంటిదన్నారు. తెలంగాణలో బీజేపీ 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాటేపల్లి జోస్యం చెప్పారు.