[t4b-ticker]

మాజీ గవర్నర్, విద్యావేత్త డాక్టర్ డి.వై. పాటిల్ కన్నుమూత

ప్రతిపక్షం, ఆగస్టు 04: ప్రముఖ విద్యావేత్త, బిహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాజీ గవర్నర్ డాక్టర్ డి.వై. పాటిల్ (90) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1935 అక్టోబర్ 22న మహారాష్ట్రలో జన్మించిన డి.వై. పాటిల్ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన స్థాపించిన డి.వై. పాటిల్ గ్రూప్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 182కు పైగా విద్యాసంస్థలు, ఏడు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. వైద్య, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఇతర ఉన్నత విద్యా రంగాల్లో ఆయన సంస్థలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.

విద్యా సేవలతో పాటు ప్రజాజీవితంలోనూ కీలక పాత్ర పోషించిన డి.వై. పాటిల్ బిహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్‌గా సేవలందించారు. ఆయన మరణంపై పలువురు రాజకీయ, విద్యా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు.

Spread the love

Related News

Latest News