Trending Now

కేటీఆర్ సహా.. బీఆర్ఎస్ నేతలంతా ప్యారాచూట్ లీడర్లే..

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు

ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 29: కేటీఆర్ సహా.. బీఆర్ఎస్ నేతలంతా ప్యారాచూట్ లీడర్లే అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. సోమవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన మంచిర్యాల చౌరస్తా భగత్ నగర్ చౌరస్తా కాశ్మీర్ గడ్డ రైతు మార్కెట్ ప్రాంతాల్లో జరిగిన రోడ్ షో లలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుబాయ్‌కి పంపిస్తామని అమాయక ప్రజల వద్ద నాడు లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ వీసాలతో దొంగ పాస్ పోర్టులతో మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని, నీతివంతమైన రాజకీయ నేపథ్యం ఉన్న చరిత్ర గల కుటుంబం నాదని రాజేందర్ రావు అన్నారు. నేనెవరో తెలియకుంటే నాడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల పునాదులపై ఏర్పాటు కాబడ్డ తెలంగాణ రాష్ట్ర సమితిలో మీ అయ్యా కేసీఆర్ ఏకంగా రాష్ట్ర కార్యదర్శి పదవిని నాకు ఎలా ఇచ్చాడో అడగాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సలహా ఇచ్చారు.

కరీంనగర్ రైతు మార్కెట్లో వ్యాపారులను విక్రయదారులను పలు షాపులలో ప్రజలతో మమేకమై తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. థర్డ్ గ్రేడ్, దొంగ కల్వకుంట్ల తారక రామారావు మీడియా ముఖంగా వెలిచాల రాజేందర్ రావు ఎవరు అని అడుగుతున్నాడు అంట.. నాతో ఖర్చు పెట్టించి, అవసరం ఉన్నంత వరకు నన్ను వెంట తిప్పుకొని, ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించి, చివరకు దొంగ బీఫారం ఇచ్చిన నీ అయ్య కేసీఆర్‌ని అడిగితే నేనెవరో చెబుతాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ గడ్డమీద పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడ జనాల మధ్య పెరిగిన నా గురించి అమెరికాలో బాత్రూంలు కడిగిన కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కరీంనగర్ లో కాల్ మోపితే స్థానిక ప్రజలు కేటీఆర్ కు బడిత పూజతో స్వాగతం పలుకుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలలో సమన్వయ కమిటీ చైర్మన్, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు నడిపెల్లి అశోక్ రావు, మహమ్మద్ ఆరిఫ్ లతోపాటు ఆయా డివిజన్లోకి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News