ప్రతిపక్షం, జూన్ 17: హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ఫైనల్ ఇయర్‌కు చెందిన 12 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్‌సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణ కొనసాగుతుండగా, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

















