ప్రతిపక్షం, తెలంగాణ: బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో మేడిగడ్డ’ టూర్‌లో బస్సు టైర్ బ్లాస్ట్ కావడం కలకలం రేపింది. ఛలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ బస్ టైర్ జనగాం దగ్గరలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. అయితే బస్సు టైర్ బ్లాస్ట్ అయిన సమయంలో బస్‌లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు భయాందోళనకు గురయ్యారు.