గ్రామాలలో కొనసాగుతున్న బెల్ట్ షాపులు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : దేశంలో ఎన్నికల ప్రవర్తన నియమవాలి అమలులోకి వచ్చి నెలరోజు కావస్తున్న నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలలో ప్రవర్తన నియమవాళికి విరుద్ధంగా బెల్ట్ షాపులును కొనసాగించడం కాకుండా ఆ పరిసరాలలో బెల్ట్ షాపులను కూడా బాహటంగానే కొనసాగిస్తూ.. వ్యాపారాలు తమ చేతివాటం చేసుకుంటున్నారు. నిర్మల్ మండలంలోని చిట్యాల లో జాతీయ రహదారి సమీపంలో ఓ సముదాయంలో బహాటా బెల్ట్ షాపును కొనసాగిస్తూ.. సదరు వ్యాపారి తనదే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ విషయమై సదరు వ్యాపారిని వివరన కోరగా.. మాట్లాడకుండానే దాటి వేస్తున్నాడు. ఎన్నికల ప్రవర్తన నియమవాళికి అనుగుణంగా గ్రామాలలో వైన్ షాపులు నిర్ణీత సమయాలు అధికారిక ఆదేశాల ప్రకారం.. కొనసాగించుకోవలసి ఉంది.
అయితే వాటిని కొనసాగిస్తూనే ఎలాంటి భయం లేకుండా బెల్ట్ షాపులను కొనసాగిస్తూ తమదైన రీతిలో దోచుకుంటున్నారు. ఎక్సైజ్ పోలీస్ అధికారుల నిర్లక్ష్యమో.. అలసత్వమో గాని అక్రమ వ్యాపారాలు కొనసాగించుకునేందుకు బెల్ట్ షాప్ యజమానులకు మంచి అవకాశంగా మారుతుంది. సదరు బెల్ట్ షాపులలో ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడమే కాకుండా అక్కడే సంబంధిత మత్తు పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తూ మందుబాబులను బాహటంగానే దోచుకుంటున్నారు. ఈ విషయమై స్థానిక పాత్రికేయులు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డికి సమాచారం అందించగా వెంటనే చర్యలు తీసుకొని సదరు బెల్ బెల్ట్ షాప్ ను సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు.