Trending Now

రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం..

హైదరాబాద్​, ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ద్వారా రైతులకు రైతు వేదికలలో నుండి శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు, సలహాలను విని వారి సమస్యలను నివృత్తి చేసుకొనుట కొరకు 110 రైతు వేదికలలో వీడియోకాన్ సిస్టం ఏర్పాటు చేయడమైనది. ప్రతి మంగళవారము ఈ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా.. ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు నేరుగా వీక్షించే అవకాశం కలగజేసినారు. తేదీ 19.3.2024 నాడు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఈ వారం వరిలో ప్రస్తుతం పాటించవలసిన మెళుకువలు మీద డాక్టర్ బి శ్రీనివాస్ జగిత్యాల నుండి వారి సూచనలను రైతులు అందజేస్తారు.

తదుపరి ఆయిల్ పాము సాగులో తీసుకోవలసిన మెలకువలను గురించి డాక్టర్ రాజశేఖర్ గారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. వేసవిలో సాగు చేసే కూరగాయలు వాటిపై వాడే పురుగుమందులు అవశేషాల గురించి రైతులకు వివరిస్తారు. ఈ కార్యక్రమము డాక్టర్ కే కవిత గారు రైతుల సందేహాలకు సమాధానం ఇస్తారు. రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి గారు పాల్గొంటారు. కావున రైతులు తమ తమ రైతు వేదికల నుండి ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love