Trending Now

బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ ను కంట్రోల్ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ ను స్వాధీనం పరుచుకున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఇంటర్ పోల్ సహాయంతో ఓ కంపెనీ లో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు.. 90 కిలోల మెపీడ్రిన్ డ్రగ్స్ ని అధికారులు స్వాధీన పరుచుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. అలగే కొంతవరకు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సప్లై చేసిన్నట్లు సమాచారం.

Spread the love

Latest News