Trending Now

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం కొనసాగిస్తాం..

నిర్మల్ : ( ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి), ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై నిత్యపోరు కొనసాగిస్తూనే ముందుకెళ్తానని బీఆర్ఎస్ జిల్లా నాయకులు రామ్ కిషన్ రెడ్డి, రామ్ నాయక్ విలాస్ గాదేవార్లు పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ ప్రత్యేక సమావేశం నిర్వహించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఏవో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న ఇచ్చినా 420 హామీల లో ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నదని ఆరోపించారు.

తమ అగ్రనేత కేసీఆర్ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కొన్ని ప్రాంతాలలో పర్యటిస్తుంటే అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఓర్చుకోలేక కాంగ్రెస్ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండడం శోచనీయమన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మేడి గడ్డను చూపుతూ వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు లేకుండా చేయడం దారుణమని చెప్పారు.

రాష్ట్రంలో గంటల తరబడి అంధకారం మేలుకుంటున్నదని ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, పట్టణ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీరుద్దీన్, నాయకులు రామకృష్ణారెడ్డి, రామ్ నాయక్, గాదె వార్ విలాస్, పూదరి నరహరి,డాక్టర్ నాగభూషణ్, సీనియర్ నాయకులు సయ్యద్ ఖాజా అక్రం అలీలతో నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గాల ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News